ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

Take advantage of government welfare schemes.– బొమ్మనపల్లి స్పెషల్ ఆఫీసర్ డీఈ హేమలత
నవతెలంగాణ – అచ్చంపేట
పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బొమ్మనుపల్లి స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ డి ఈ హేమలత సూచించారు. శుక్రవారం బొమ్మనపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఇందిరమ్మ ఆత్మీభరోసా, రైతు భరోసా రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయుటకు లబ్ధిదారులను గుర్తించారు. ప్రభుత్వం ఇబ్బందుల ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని హేమలత అన్నారు ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పంచాయతీ రాజ్ ఏఈ రమేష్ , ఏఈఓ లు అనుష పరమేష్, జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీవాణి, పంచాయతీ కార్యదర్శి శ్రీ రమేష్ బాబు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.