జూనియర్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి 

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలో గత సంవత్సరంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ను మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. ఆయన గురువారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో క్యన్వాసింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-2025 విద్యా సంవత్సరానికి  అడ్మిషన్ల కొరకు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇంటర్మీడియట్ కోర్సులలో ఎంపీసీ, బైపిసి, సీఈసీ, హెచ్ఇసి కోర్సులలో ఖాళీలు ఉన్నాయని పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు  కాలేజీలో చేరాలని ఆయన కోరారు.అడ్మిషన్ ఫీజు మరియు టెక్స్ట్ బుక్స్ ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు. వేరే గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం కూడా ఉంటుందని అలాగే స్కాలర్షిప్ సౌకర్యం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫరూక్ , కళాశాల సిబ్బంది సాయిరాం, రమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.