– డీసీసీబీ సీవో రెహమాన్
నవతెలంగాణ-ముదిగొండ
పామాయిల్ సాగు చేసే రైతులు డీసీసీబీ నుండి అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు సిఓ రెహమాన్ అన్నారు. మండలపరిధిలో మేడేపల్లి సొసైటీ కార్యాలయంలో పామాయిల్ సాగు చేసే రైతులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ సాగుకు బ్యాంకు నుండి ఇచ్చే రుణాలు గురించి ఆయన వివరించారు. పామాయిల్ సాగు రైతులకు ఎంతో మేలున్నారు. తక్కువ పెట్టుబడుతూ ఎక్కువ లావాదాయకము ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డీజిఎం ఉదయశ్రీ, సొసైటీ చైర్మెన్ సామినేని వెంకటేశ్వరరావు, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, డీసీసీబీ ముదిగొండ మేనేజర్ అలేఖ్య, సీఈవో భాగం శ్రీనివాసరావు, గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ సొసైటీని సందర్శించిన డీసీసీబీ సీఓ
మండల కేంద్రమైన ముదిగొండ సొసైటీ కార్యాలయాన్ని డిసిసిబి సీఓ రెహమాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించి, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందని చైర్మెన్ తుపాకుల యలగొండస్వామితో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీ పథకంలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతిగతిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. రైతుల రుణమాఫీ అనంతరం నూతనంగా రైతులకు రుణాలు అందించాలని సిఓను చైర్మెన్ యలగొండస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డిజిఎం ఉదయశ్రీ, ముదిగొండ సొసైటీ వైస్ చైర్మెన్ బట్టు పురుషోత్తం, సీఈవో కే.వెంకటరత్నం, డిసిసిబి మేనేజర్ అలేఖ్య, సొసైటీ డైరెక్టర్లు రాయల శ్రీనివాసరావు, వనం ప్రదీప్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.