
ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ ,రంగారెడ్డి లాజిస్టిక్ అధికారి సి రవీందర్ అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలో నల్గొండ డిపో ఆధ్వర్యంలో నూతన కార్గో సెంటర్ ను స్థానికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు సులభంగా దేశంలో ఎక్కడైనా పార్సల్ చేసుకోవడానికి పార్సల్ పొందుటకు అనుగుణంగా అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్యాం కుమార్, రీజనల్ సేల్స్ హరిలాల్, దేవరకొండ డిపో అధికారి యాదయ్య, కార్గో నిర్వాహకుడు సంగిెప్పు ఓంకార్ , భీమనపల్లి శ్రీనివాసులు, తాడిశెట్టి రాకేష్ రవీందర్ రెడ్డి, సతీష్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.