ఓటు నమోదుకు శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: తహశీల్దార్

Take advantage of camps for voter registration: Tehsildarనవతెలంగాణ – అశ్వారావుపేట 
పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని అందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ నూతన ఓటు నమోదుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ వి.కృష్ణ ప్రసాద్ సూచించారు. శనివారం మండలంలోని పోలింగ్ బూత్ లలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శని, ఆది రెండు రోజులు పాటు ఈ శిబిరాల ద్వారా ఓటు హక్కు దరఖాస్తులను స్వీకరించటం జరుగుతుందని, అర్హత కల్గిన యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరాలు లో బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరించారు.