సీఎం కప్ పోటీలను సద్వినియోగం చేసుకోండి

నవతెలంగాణ క్రిష్ణా 
రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం సీఎం కప్ 2024 ను గ్రామా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించనుందని మండల ఎంపీడీవో జానయ్య తెలిపారు ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశంలో అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను 7వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు వరకు ఆయా తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఆట పోటీలకు ఆసక్తిగల యువకులు ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇట్టి పోటీలకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి చైర్మన్ గా మండల స్థాయిలో మండలం ప్రత్యేక అధికారి చైర్మన్ గా ఉండి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించిన అభ్యర్థులకు బంగారం వెండి పథకంతో పాటు పథకంతో పతకంతో పాటు నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు, ఈ సార్వత్రిక పోటీలను మండలంలోని ఆయా గ్రామాలకు యువకులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.