ముధోల్ లో ఏర్పాటు అయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ వెనుకబడిన తరగతుల సంఘం, పలువురు నాయకులతో కలిసి మాట్లాడారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.ఇంటర్ పూర్తి అయినా ప్రతి విద్యార్థి అడ్మిషన్ చేసుకోవాలని సూచించారు .ముధోల్ లో ని ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సమీపంలో ఖాళీగా ఉన్న గురుకుల పాఠశాల భవనంలో అన్ని వసతులు ఉన్నట్లు వారు తెలిపారు. అదేవిదoగా విద్యార్తులకు బస్సు సౌకర్యం ఉన్నదని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తక్షణమే పరిష్కారనికి ముధోల్ సంఘం తమ వంతు గా కృషి చేస్తుందన్నారు.విధ్యార్థులు ఎక్కువ సంఖ్యలో కళాశాల లో చేరాలని సూచించారు.ఈ కార్యక్రమం లో తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రోళ్ల రమేష్, గ్రామ అభివృద్ధి సంఘం అధ్యక్షులు నారాయణ,కోశాధికారి మేత్రి సాయినాథ్,నాయకులు తాటివార్ రమేష్, దశరత్,భాస్కరోళ్ల లవణ్, మనోరంజన్, సంఘం సభ్యులు పండరి,గోపాల్, సాయినాథ్, గంగాధర్, విట్టల్, లింగన్న, రమేష్, సురేష్,మనోహర్, పండరి, పోశెట్టి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.