చెకుముకి పరీక్షను సద్వినియోగం చేసుకోవాలి

– ప్రశ్నాపత్రాలు  విడుదల చేసిన డీఈఓ
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణిత అన్నారు. గురువారం పట్టణంలో పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ కు సంబంధించిన ప్రశ్నాపత్రాలను డీఈఓ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ..  శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషిలో భాగంగా విద్యార్థి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్ష  పాఠశాల స్థాయిలో అలాగే నవంబర్ 21వ తేదీన మండల స్థాయిలో, డిసెంబర్ 28వ తేదీన జిల్లాస్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి డిసెంబర్ 14, 15, 16 తేదీలలో పట్టణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్ష నిర్వహినకు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే మండల విద్యాధికారులు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ నిర్వాహకులకు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, డీపీఆర్ఓ తిరుమల, లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రిన్సిపల్ దేవేందర్ పటాస్కర్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.ఉమాకాంత్, పెంటపర్తి ఉషన్న, జిల్లా నాయకులు దాసరి బాబన్న, మెస్రం రాజు పాల్గొన్నారు.