నేడు నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

నవతెలంగాణ – నూతనకల్
ఈనెల 27న మండల కేంద్రంలోని శ్రీమాతా జనరల్ హాస్పిటల్ లో శరత్ కంటి వైద్యశాల హనుమకొండ వారిచే నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని లైన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు డాక్టర్ ఎస్ కె నాగుల్ మీరా అన్నారు శుక్రవారం మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు మండల ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కార్డు , పెన్షనర్లకు , లకు హెల్త్ కార్డులపై ఆపరేషన్ను చేసి మందులు ఇవ్వబడునని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బందు కృష్ణయ్య నారాయణరెడ్డి తండు సత్యనారాయణ పన్నాల మల్లారెడ్డి గంగరాజు దరిపెల్లి వీరన్న రేణుక తదితరులు పాల్గొన్నారు