ఉచిత గ్రాండ్ టెస్ట్ ను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రస్థాయిగ్రూప్-2, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధనవుతున్న అభ్యర్థులకు ఈ నెల 14న తెలంగాణ యూనివర్సిటీ లో ఒఎసిఈ  వారి సౌజన్యంతో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీను నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉదయం 10గంటల నుండిమద్యహ్నం1గంటల వరకు గ్రూప్-2, మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్ష ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.