తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ సంక్షేమ శాఖ,హైదరాబాద్ వారు యూ.పీ.ఎస్.సి–సి.ఎస్.ఎ.టి పరీక్ష కోసం 2024 -25 విద్యా సంవత్సరంలో వందమంది మైనారిటీ అభ్యర్ధులకు ఉచిత శిక్షణను నిర్వహిస్తోంది అని జిల్లా మైనారిట సంక్షేమ శాఖ అధికారి కే జగదీశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు రిజర్వేషన్ల నియమం ప్రకారం మహిళా అభ్యర్ధులకు 33.33 శాతం సీట్లు అన్నీ రిజర్వ్ కేటగిరీలలో వికలాంగులకు 5 శాతం సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.స్టడీ సర్కిల్ లో మొదటి సారీ ప్రవేశం పొందే అభ్యర్ధులందరూ ప్రవేశ పరీక్షకు ధరఖాస్తు చేసుకోవాలి,ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉందన్నారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ప్రవేశం కోసం రాష్ట్రంలో అన్నీ జిల్లాలలో సాధారణ ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీస్ అభ్యర్ధులు www.tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. దరఖాస్తుల చివరి తేది: ఈ నెల నుండి 22 వరకు పొడిగించడం జరిగిందని పేర్కొన్నారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్