ఉచిత పశు వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి

Take advantage of the free veterinary campనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని మోటాట్ పల్లి గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అందరూ  వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరుగుతుందన్నారు. లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని, దీనికిగాను రైతు వాటా 250 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఈ శిబిరంలో దాదాపు 25 గేదెలు 8 ఆవులకు చికిత్స చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ మాజీద్, నిజామాబాద్, తాడ్వాయి పశువైద్యాధికారి డాక్టర్ రమేష్, డి ఎల్ డి ఏ సూపర్వైజర్ కృష్ణ, పాల కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.