– మాజీ గ్రంథాలయ చైర్మన్ డిప్యూటీ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దొరికి సొసైటీ చైర్మన్ డిప్యూటీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం నసురుల్లా బాద్ మండలం దుర్కీ గ్రామాల్లో పిఏసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో దుర్కి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసిల్దార్ బావయ్య, సొసైటీ చైర్మన్ బ్యూటీ శ్రీనివాస్ యాదవ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ డివిడి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రూ.2320, బీ గ్రేడ్ ధాన్యం రూ.2300 రేటును నిర్ణయించిందన్నారు.రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యతగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి ఓపీఎంఎస్ చేసి డబ్బులు వచ్చే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ డాక్టర్ నారాయణ, మాజీ సర్పంచ్ నారా గౌడ్ , సీనియర్ నాయకుడు శంకర్, పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.