
ఈ నెల 26న ఆదివారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు గోల్కొండ అకాడమీ వారి సౌజన్యంతో తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్-1, గ్రూప్-2 గ్రాండ్ టెస్ట్ ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి సూచించారు. సోమవారం గ్రాండ్ టెస్ట్ కు సంబంధించిన పోస్టర్లను విద్యార్థి సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రాండ్ టెస్ట్ లో పాల్గొనాలని కోరారు. దీని ద్వారా పరీక్షల భయం తొలుగుతుందని సూచించారు.అనంతరం గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రూప్స్ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశమన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులు సాగర్ నాయక్, రాజేందర్, శ్రీనివాస్ నాయక్, నరేష్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.