లయన్స్ క్లబ్ ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలి

– వ్యవస్థాపక అధ్యక్షులు పూదరి దత్తాగౌడ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూదరి దత్తాగౌడ్ కోరారు. ఆదివారం హుస్నాబాద్ మండల కేంద్రంలో మల్లెచెట్టు చౌరస్తాలో ఉచిత లయన్స్ విజన్ సెంటర్ ను లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జపాన్ కంప్యూటర్ తో ప్రతి రోజు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.కంటిలో శుక్లాలు ఉన్న వారికి ఉచితంగా కరీంనగర్ లోని రేకుర్తిలో కంటి శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. ఉచిత రవాణా భోజన వసతులు కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ విజన్ కేర్ అధ్యక్షులు లయన్ మాదర్ ఖాన్, లయన్ షకీల్, లయన్ తమ్మనవేని రవీందర్ ,రామకృష్ణ పాల్గొన్నారు.