ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి


– హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత కోరారు. శుక్రవారం పట్టణంలోని 3,4,16,17వ వార్డులలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఆరు గ్యారెంటీ ల దరఖాస్తులు స్వీకరణ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ ఎం రాజశేఖర్, చైర్మన్ రజిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి ,కౌన్సిలర్లు కోమటి స్వర్ణలత, జనగామ రత్నమాల, వల్లపు రాజు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీర్జాపూర్ లో ప్రజా పాలన… హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్, తిమ్మాపూర్, ఉమ్మపుర్, బల్లి నాయక్ తండ గ్రామంలో శుక్రవారం ప్రజా పాలన కార్యక్రమాన్ని ఎంపీపీ లకావత్ మానస, తహసిల్దార్ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తరాల లతా మహేందర్, ఎంపీ ఓ సత్యనారాయణ, సిడిపిఓ జయమ్మ, ఏఈఓ కాశ బోయిన విజయ్, పంచాయతీ కార్యదర్శి శారద వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.