కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

– అదనపు కలెక్టర్‌ రమేష్‌
నవతెలంగాణ-కొల్చారం
రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్‌ రమేష్‌ అన్నారు. శనివారం కొల్చారం సహాకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతుల అవసరాల దష్ట్యా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని, తాలు లేకుండా తూర్పార పట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌, ఐసిడిఎస్‌ పీడీ బ్రహ్మాజీ, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహశీల్దార్‌ గఫ్ఫార్‌, ఎంపీడీవో గణేష్‌ రెడ్డి, సహాకార సంఘం చైర్మన్‌ మనోహర్‌, సీఈవో కష్ణ, డిప్యూటీ తహశీల్దార్‌ నాగవర్ధన్‌, ఆర్‌ఐ ప్రభాకర్‌, ఏపీవో మహిపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ/తూప్రాన్‌ రూరల్‌ (మనోహరాబాద్‌)
పండించిన పంటను రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ఆర్థికంగా అభివృద్ది చెందాలని మనోహరాబాద్‌ మండల స్పెషల్‌ ఆఫీసర్‌ కృష్ణమూర్తి సూచించారు. శనివారం మండలంలోని లింగారెడ్డిపేట, కూచారం, పర్కిబండ, రంగాయిపల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఐకేపి ద్వార ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి స్రవంతి, ఏపీఎం పెంటాగౌడ్‌, ఏఈవోలు సచిన్‌, నరెందర్‌గౌడ్‌లతో పాటు మహిళా గ్రూపుల సభ్యులు తదితరలు పాల్గొన్నారు.