కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేతి వృత్తిదారులు విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ చండూరు ఇన్చార్జి దర్శన వేణు కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక శిలా అనసూయ గార్డెన్ లో చండూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు,నాయకులకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందన్నారు. అందరి సమిష్టి ఐక్యతతో రానున్న ఎన్నికల్లో కౌన్సిలర్ ,మున్సిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందని ధీమా వక్త్యం చేశారు.మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. ప్రజాసమస్యలు, అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్ల సమస్యల పై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు సోమ నరసింహ,రాష్ట్ర ఒబిసి మోర్చ అధికార ప్రతినిధి కోమటి వీరేశం, అసెంబ్లీ కో కన్వీనర్ కాసాల జనార్ధన్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి నకేరికంటి లింగుస్వామి గౌడ్,సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు,భూతరాజు శ్రీహరి,సోమ శంకర్,బొబ్బిలి శివ,ఉమ్మడి వెంకటాచారి,తడకమల్ల శ్రీధర్, గండు శ్రీకాంత్,కటకం నరేష్,మదగోని నాగార్జున,కరింగు శంకరయ్య, ఇరిగి ఆంజనేయులు,పెర్ల గణేష్,భూతరాజు స్వామి, దోటీ శివ,భూతరాజు వేణు,చెరుపల్లి కృష్ణ,గొల్లూరి వెంకన్న,పున్న అరుణోదయ,భూతరాజు రామకృష్ణ,సాగర్ తదితరులు పాల్గొన్నారు.