
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 20, 21 రెండు రోజులపాటు నిర్వహించే కొత్త ఓటర్ నమోదు క్యాంపియన్ కార్యక్రమాలను మద్నూర్ మండలంలోని ప్రతి గ్రామంలో గల ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండే బిఎల్వోలకు ఓటర్ నమోదు కోసం దరఖాస్తులు అందజేయాలని మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ మండల ప్రజలను కోరారు. కొత్త ఓటర్ నమోదు కార్యక్రమాలను తహసీల్దార్ శనివారం నాడు మండలంలోని మద్నూర్ మండల కేంద్రంతో పాటు మెనూర్, కొడచరా, శాఖాపూర్, తదితర గ్రామాలను సందర్శించి ఓటర్ నమోదు కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించే కొత్త ఓటర్ నమోదు కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్క యువతీ యువకులు ఫామ్ సిక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే ఓటర్ ఐడి కార్డులు తప్పులు ఉన్న వారు ఫామ్ 8 ద్వారా దరఖాస్తులు చేసుకొని ఓటర్ ఐడి కార్డులలో తప్పులు సరిచేసుకునే అవకాశాలు ఉన్నాయని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ కోరారు. తహసిల్దార్ వెంట ఆర్ ఐ శంకర్ జూనియర్ అసిస్టెంట్ ఎన్నికల విజయ్ మరో జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ బాలరాజు రవికుమార్ మద్నూర్ జిపి సెక్రెటరీ సందీప్ ఆయా గ్రామాల బిఎల్వోలు కొత్త ఓటర్ నమోదు దరఖాస్తుదారులు పాల్గొన్నారు.