నవతెలంగాణ- నెల్లికుదురు
నీది, నిషి ఇంటర్నెట్ సెంటర్ లో అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉన్నాయని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్లు భారతీయ స్టేట్ బ్యాంక్ నెల్లికుదురు శాఖ మేనేజర్ పర్వతం రాజేష్ జాతీయ మాల మహానాడు రాష్ట్ర పిల్లి సుధాకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిధి & నిషి ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఇంటర్నెట్ సెంటర్ను ఉంచుకొని నిర్వహించడం పట్లా వారిని అభినందించినట్లు తెలిపారు యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఏదో ఒక రంగంలో శిక్షణ పొంది స్వయం ఉపాధిని ఎంచుకోవాలన్నారు. ఏర్పాటు చేసుకున్న యూనిట్ విలువ ప్రకారం నిబంధనల మేరకు ప్రభుత్వం రాయితీతో కూడిన రుణ సదుపాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో నడిచేందుకు కృషి చేయాలని అన్నారు ఉపాధి కోసం యువత ఏదో ఒకటి ఎంచుకొని ముందుకు సాగడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, ఐ బి డి ఈ దైద నరసయ్య, మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు, పులి రామచంద్రు, వెన్నాకుల శ్రీనివాస్ ఆదిరెడ్డి, నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, పెరుమాండ్లతిలక్ గౌడ్, బంధారపు యాదగిరి గౌడ్, వేణుధర్ రెడ్డి, వెన్నం క్రాంతి రెడ్డి, మద్ది రాజేష్ కొంపల్లి శ్రీశైలం యాదవ్ కుమ్మరి కుంట్ల మౌనేందర్, దాసరి ప్రకాష్, బొటమంచి బిక్షపతి, ప్రోప్రైటర్లు అశోద భాస్కర్, శశి కుమార్ వివిధ శాఖల ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.