
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు, గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశంలో పడి కాలు విరిగిన అంబాలా లక్ష్మిని ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 1 న పనికి వెళ్లిన లక్ష్మి పని దగ్గర కాలుజారి పడడంతో ఆమె కుడి కాలు తొంటిలో విరిగింది కానీ ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ఉపాధి చట్టం ప్రకారం ఆమెకు హార్దిక సహాయం అందించాలని అదేవిధంగా రోజువారి మాస్టరు వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే హాస్పిటల్ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలని ఇప్పటివరకు పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరారు.లేనియెడల కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు, అంబాల సుశీల,కనకమ్మ,భాగ్య,ఎల్లమ్మ ,రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.