బాల్క సుమన్ నోటికి అదుపులో పెట్టుకో..

– కాంగ్రెస్ నాయకుల పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన నోటికి అదుపు లేకుండా మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు చుస్బాతు ఊరుకోబోరని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కెసిఆర్ తన బానిసలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని వారు విమర్శించారు.పదెళ్ళ బిఅర్ఎస్ పాలనలో రాష్ట్రం లో అల్లకల్లోలం సృష్టించారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బిఅర్ఎస్ దే నన్నారు.ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో నిమగ్నమై ముందుకు పోతుంటే దాన్ని జీర్ణించుకోలేని కల్వకుంట్ల మిడతల దండు వారి బానిసలచే తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దొర గడీల దగ్గర ఎంగిలి మెతుకులకి ఆశపడి బ్రతికే బాల్క సుమన్, ఓడిపోయామన్న అక్కసుతో ప్రజా పాలనని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచితంగా మాట్లాడటాన్ని తమంత ముక్తకంఠంతో ఖండిస్తున్నామని పేర్కొన్నారు.ఇకనైన తమ పద్దతులను మార్చుకోవాలని లేకపోతే ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉందని వారన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, అమృత పూర్ గంగాధర్, డాక్టర్ శాదుల్లా, జంగిలి లక్ష్మి, వెంకట్ రెడ్డి,కర్స మోహన్, ఆశిష్, ఉన్నారు.