స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి..

Government welfare schemes should be taken to the people in local body elections.– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్సికి ఎమ్మెల్యేకు సూచన ..
నవతెలంగాణ – మద్నూర్ 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మునిసి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుకు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపాదాస్ మున్షీ గారిని బుధవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వారి నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని దీపాదాస్ మున్షీ  ఎమ్మెల్యే గారికి సూచించారు.