రూణాలు తీసుకొని ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి..

– వారంలోపే నాల్గు కోట్లు అందజేసిన బ్యాంకు సిబ్బంది కృషి అమోఘం..
– ఒకోక్క గ్రూప్ కు 20లక్షల రూణాలు..
– యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్,రీజినల్ హేడ్ శేంకర్ హేయ్ రాం..
నవతెలంగాణ -డిచ్ పల్లి
స్వయం సహాయక సంఘాలు బ్యాంకులు నుండి  రూణాలు తీసుకొని ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని, నిజామాబాద్ జిల్లాలోని ఇప్పుడు ఎస్ హెచ్ జి గ్రూపులకు 20 లక్షల చొప్పున అందజేయడం శుభపరిణామమని, మహిళా సంఘాలకు అడిగిన వెంటనే వారంలోపే నాల్గు కోట్ల రూపాయల మేర పలు గ్రూపులకు అందజేయడానికి ఇందల్ వాయి మండల కేంద్రం లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు విశేష కృషి చేశారని వారందరిని అభినందించవలసిందని, బ్యాంకు సిబ్బంది కృషి అమోఘమని ఇందల్ వాయి మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్వాక్రా స్వయం సహాయక సంఘాల రూణా మేళా కు ముఖ్యఅతిథిగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్, రీజినల్ హేడ్ మేనేజర్ శేంకర్ హయ్ రాం పాల్గొని మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళా సంఘాలకు ఒక్కో గ్రూపునకు 20 లక్షల రూపాయల చొప్పున యూనియన్ బ్యాంక్ తరఫున ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా రుణం పొందే వీలుంటుందని, క్రమం తప్పకుండా బ్యాంకులో ప్రతినెల చెల్లించవలసిన రుణాలను చెల్లిస్తూ బ్యాంకు పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇదే కాకుండా బ్యాంకులలో తక్కువ డబ్బులతో భీమ చేసుకునే సదుపాయం ఉందని బ్యాంకులలో మంచి రికార్డు ఉంటే ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు రుణాలను అందజేయడానికి సిబ్బంది సహకరిస్తారన్నారు. ఏజీఎం శివ కోటయ్య మాట్లాడుతూ పదిమంది సంఘటితంగా ఉండీ మహిళ సంఘంలో ప్రతి గ్రూపునకు సీనియారిటీ ప్రకారంగా యూనియన్ బ్యాంకు నుండి రుణాలు ఇవ్వడం జరుగుతుందని ఇలాంటి సదుపాయాన్ని గ్రూప్ సభ్యులు డ్వాక్రా సంఘాల వారు సద్వినియోగం చేసుకొని వారి ఆర్థిక అవసరాల నిమిత్తం వాడుకోవాలని, వీటితోపాటు వారి కుటుంబ సభ్యులకు ఏదైనా వ్యాపార నిమిత్తం రుణం కావాల్సిన వారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించాలని మహిళలను సూచించారు. డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ఏజీఎం రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా తీసుకున్న రుణాన్ని ప్రతినెల చెల్లించి బ్యాంకు సహకరించాలని అలాగే వారి కుటుంబానికి ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రతి ఒక్క మహిళ మరియు డ్వాక్రా సంఘాలు యూనియన్ బ్యాంక్ రుణం పొంది సకాలంలో నెలవారీ కిస్తీలు చెల్లించి బ్యాంకు వారికి సహకరించాలని ఆయన సూచించారు. నేడు మహిళలు పురుషులతో పోటీపడి వ్యాపారంలో వృద్ధి సాధిస్తున్నారని భార్యాభర్తలు కలిసి ఏదైనా వ్యాపారం చేసుకుంటే కుటుంబం ఇబ్బందులు లేకుండా గడుసుందన్నారు ఇదే కాకుండా తీసుకున్న రుణాలను వ్యాపారంలో, చిన్న పరిశ్రమలు ఇతర వాటిలో పెట్టుబడి పెట్టుకుని లాభం పొందుతూనే సక్రమంగా బ్యాంకుకు వాయిదాల పద్ధతిలో కట్టుకోవాలన్నారు.రాబోయే రోజుల్లో సుమారు ఐదు కోట్ల రూపాయలు ఒక్క యూనియన్ బ్యాంకు నుండి పంపిణీ చేయాల్సిన టార్గెట్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే చేరుకోవడానికి బ్యాంకు మేనేజర్, సిబ్బంది కృషి మరువలేనిదని పేర్కొన్నారు.డ్వాక్రా సంఘాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సి ఎ లకు శాలువా బహుమతులతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందల్ వాయి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్, ఆర్డిఓ విశాల్ పావర్, అనురాధ, మోతిరం, ఉదయ్, తోపాటు స్వయం సహాయక సంఘాల మహిళలు, బ్యాంకు సిబ్బంది బ్యాంక్,విఓఎలు‌ తదితరులు పాల్గొన్నారు.