– ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ 90 శాతం వరకూ నమోదవుతుండగా, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి మహానగరాల్లో 50 శాతం మించకపోవడం పట్ల ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ఫోరం అధ్యక్షులు యం.పద్మనాభరెడ్డి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్‌కు కొన్ని సూచనలు చేస్తూ లేఖ రాశారు. తెలంగాణలో మే 13న పోలింగ్ ఉండగా, అంతకు ముందు రెండు రోజులు అంటే మే 11, 12 తేదీలు కూడా సెలవు దినాలున్నాయని గుర్తుచేశారు. దీంతో ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ రంగంలో పని చేసే వేరే ప్రాంతాలకు వెళ్లే అవకాశముందని చెప్పారు. మే 13 సెలవును ఓటు వేస్తేనే సెలవుగా పరిగణించాలనీ, లేకపోతే లాస్ ఆఫ్ పే కింద తీసుకోవాలని సూచించారు.