గత మూడు రోజుల నుండి వర్షాలు కురవడంతో సోమవారం రోజు మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పర్బన్న ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి వర్షాలు కురవడంతో గ్రామాలలో వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. త్రాగునీటిలో క్లోరినేషన్ గ్రామంలో మురికి కాలువల పరిశుభ్రత అదేవిధంగా గ్రామాలలో ఏర్పాటు చేయనున్న ప్లాంటేషన్ పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.