– పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శికి వినతి
నవతెలంగాణ-లక్ష్మీదేవి పల్లి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో ముందస్తు నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీ పరిపాలన అధికారి, కార్యదర్శికి విడివిడిగా డీవైఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు గుగ్గల సుదీర్ మాట్లాడుతూ మండలంలో ప్రతి పంచాయతీలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సానుకూలంగా స్పందించిన వారు విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోగ్గేలా సుధీర్, మండల కార్యదర్శి నూనావత్ విజరు కుమార్, సభ్యులు సందీప్, సుశాంత్ పాల్గొన్నారు.