– ఎస్ ఎఫ్ ఐ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్
నవతెలంగాణ – వీర్నపల్లి
నేటితరం యువత విద్యార్థులు సావిత్రిబాయి పూలే పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారు మాట్లాడుతు మనుధర్మం రాజ్యమేలుతున్న రోజుల్లో నిమ్న బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా అనగారిన వర్గాలకు చదువుకోవడానికి నిషేధించిన కాలంలోనే చదువు యొక్క ప్రాముఖ్యత, చదువు అనగారిన వర్గాలను ఎలా పైకి తీసుకువస్తుందని అవగాహనతోనే జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పి పాఠశాల నెలకొల్పి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలి గా తీర్చిదిద్దారన్నారు . పూలే గారి స్త్రీ పురుష సమానత్వ, ఆత్మగౌరవ, కుల నిర్మూలన పోరాటాల ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి హక్కులను రాజ్యాంగం ద్వారా పొందగలిగామన్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకు విద్యపై నిషేధం నిర్బంధం ఇప్పుడు లేకపోయినప్పటికీ చదువును మార్కెట్లో సరుకు లాగా వస్తువుగా ఈ ప్రభుత్వాలు మార్చాయన్నారు. విద్యా ప్రైవేటీకరణకు కార్పొరేటీకరణకు కేంద్ర ప్రభుత్వ కాషాయీకరణకు వ్యతిరేకంగా అసమానతలు లేని కామన్ స్కూల్ విద్యా విధానం అమలుకై పూలే ఆశయాలను వారి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం యువత విద్యార్థులు ముందుకు నడవాలన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జాషువా, హారోన్ , విష్ణు, పసుల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.