జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులను దూరంగా నెట్టే అవకాశం 

– పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరే 
– హోప్ ఆస్పత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపి కృష్ణ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నేడు ప్రపంచ గుండె దినోత్సవం మనిషి బతుకుకు ముఖ్యమైన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని అందుకోసం గుండె జబ్బులకు కారణాలను తెలుసుకుని ముందుగా జాగ్రత్త పడటం మంచింది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీకు ఫలానా రిస్క్ ఫాక్టర్స్ ఉన్నాయి. అందుకే హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతారు. ఆ రిస్క్ ఫాక్టర్స్ ఏమిటంటే? డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ సేవించడం, హై బ్లడ్ ప్రెషర్, ఒత్తిడితో కూడిన జీవితం, ఎప్పుడు కూర్చునే ఉండటం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, గుర్తించని కారణాలు ఉన్నాయని హోప్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ తెలిపారు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆంజియో ప్లాస్టీ చేయడం గానీ, బైపాస్ సర్జరీ చేయడం గాని జరుగుతుంది. దానితో పాటు నిర్వహణ కోసం ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీకు తెలుసా రిస్క్ ఫాక్టర్స్ అన్ని కూడా తగ్గించుకుని మరో హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ మార్చుకోబడును. ఇంకోసారి ఛాతి నొప్పి రాకుండా చేసుకోవచ్చు. కార్డియాక్ రిహాబ్ ద్వారా సంతోషంగా ఉండవచ్చు.
డయాబెటీస్..
చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చేంత వరకు వారికి డయాబెటీస్ ఉన్న విషయం తెలియదు. కొందరికి డయాబెటీస్ ఉన్న విషయం తెలుసు. ఔషధాలు రెగ్యులర్గా తీసుకోవడం తెలుసు, కానీ అది నియంత్రణలో లేదన్న సంగతి తెలియదు. కార్డియాక్ రిహాబ్ ద్వారా శరీరంలో ఉన్న కండరాలు యొక్క పనితీరు పెరుగుతుంది. జ్ఞాని వల్ల కండరాల గ్లూకోస్ తీసుకోవడం పెరిగిపోతుంది.  డయాబెటీస్ అనే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయి మరో హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు.
కుటుంబ చరిత్ర..
కొన్ని హార్ట్ అటాక్లు కుటుంబంలో వారసత్వంగా వస్తుంటాయి. ఎందుకంటే ఈ సమస్య వారి జన్యువుల్లో ఉంటుంది. ఈ జన్యువులను కూడా సరి చేసుకోవచ్చు. దాన్నే ఎపీ జెనెటిక్స్ అంటారు. జీవనశైలి ద్వారా జన్యువుల్లో లోపాలను సరి చేసుకోవచ్చు. ఏ కుటుంబంలోనైతే ఈ జన్యువులున్నాయో కార్డియాక్ రిహాబ్ చేసుకోవడం ద్వారా వారి జన్యువులు మారిపోయి హార్ట్ అటాక్ రాకుండా దూరం అవుతుంది.
హై బ్లడ్ ప్రెషర్..
దీర్ఘకాలికంగా హైపర్ టెన్షన్ ఉండటం వల్ల గుండె బాగా గట్టిపడి దాని కండరాలు గదుల సైజు చిన్నగా అవుతుంది. దీని వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలుంటాయి. కార్డియాక్ రిహాబ్ ద్వారా పాజిటివ్ మార్పులు గుండె కండరాల్లో వస్తాయి. దీంతో గదుల సైజు పెరుగుతుంది. దీన్ని ఎక్సెంట్రిక్ డయలటేషన్ అంటారు. ఇలాంటి మార్చే ప్రొఫెషనల్ అథ్లెటిక్స్లో కూడా ఉంటుంది. తద్వారా హార్ట్ అటాక్ అనేది నివారించుకోవచ్చు.