నవతెలంగాణ-ముధోల్ : ఆర్జీయూకేటీ బాసరకు డాక్టర్ డి రాజేష్ డీఎస్పీగా బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు.. 1996 బ్యాచ్ కు చెందిన ఈయన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు . ఆనంతరం మెదక్ జిల్లా డిఎస్పీగా పనిచేసి ఆర్జీయూకేటీ బాసరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఈసందర్భంగా ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మర్యాద పూర్వకంగా కలిసి ,నియామక పత్రాన్ని అందించి, విధుల్లో చేరారు.