
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల బదిలీలలో భాగంగా ఇదివరకే రూరల్ ఎస్సైగా పనిచేసిన మహేష్ ను భీంగల్ బదిలీపై వెళ్లగా జగిత్యాల నుండి బదిలీపై వచ్చిన ఎస్సై ఆరిఫ్ గురువారం రూరల్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. దీంతో సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి ఆహ్వానించారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యత్మక ప్రాంతాల ప్రజలు ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విగాతం కలగకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి, ప్రజలకు సూచించారు.