ముగిసిన తాళ సప్తమి వేడుకలు 

Tala Saptami celebrations are overనవతెలంగాణ – కుభీర్
గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న శ్రీ రాజరాజేశ్వర మందిరంలో కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు శనివారంతో ముగిశాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో రాజరాజేశ్వరునికి ముందుగా ఆలయ పూజారి జంగం దత్తత్రి ప్రత్యేక పూజలు చేసి ఆలయంలో శ్రీకృష్ణుడు కి ఉయ్యాల వేసి నామకరణం చేశారు. అనంతరం అక్కడి నుంచి ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న రాజరాజేశ్వర ఆలయంలో పురాతన కాలం నుంచి అనవహితిగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటి వరకు కోనసాగిస్తున్నామని అన్నారు. అదే విదంగా ఈకార్యక్రమం గత వారం రోజుల నుంచి ప్రతి రోజు వారిగా ఆర్య వైశ్యులు  అక్కడ పూజలు చేసి నిత్యాన్నదాన కార్యక్రమాలు భజనలు చేపట్టి చివరి రోజున గ్రామస్తులందరు కలసి మెలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దింతో ఆలయానికి రాజరాజేశ్వరునికి దర్శించుకోవడానికి గ్రామానికి చుట్టూ ప్రక్కల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సంతోష్, శేరి సురేష్ ,బాబు ,మడి రమేష్,రాజన్న గ్రామ పెద్దలు చిమ్మన్ పోశెట్టి తూము రాజేశ్వర్ రాజన్న శివలింగం స్వామి నాగుల మల్లన్న గ్రామస్తులు యువకులు తదితరులు ఉన్నారు.