ముగిసిన తాళ సప్తమి వేడుకలు ..

Thala Saptami celebrations are over..నవతెలంగాణ – కుబీర్
మండల కేంద్రమైన కుబీర్ లోని విటళేశ్వర్ ఆలయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు శుక్రవారం ముగింపు జరగాయి. దింతో ఉదయం విఠల్ రుక్మిణి దేవత మూర్థులకు ప్రత్యేక పూజలు చేసి విఠల్ రుక్మిణి బాయి దేవతలకు కాకడ హారతి ఇచ్చి గ్రామంలో ఉన్న ప్రధాన విధుల గుండా బాజా భజేంత్రి తో పల్లకి ఊరేగింపు చేశారు. అనంతరం గ్రామంలో ఉన్న యాదవ్ సంఘం, మున్నూరు కాపు సంఘంతో పాటు గ్రామస్తులు అందరు  కలసి దాదాపుగా 40క్వాంటల్ బియ్యం తో బండార కార్యక్రమం చేపట్టడం జరిగింది. దింతో ఈ సందర్బంగా ఆలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది లో కార్తీక మాసం లో నిరావహించే సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దింతో గ్రామమలో ఉన్న ప్రతి ఒక్కరు కార్యక్రమానికి హాజరై విఠల్ రుక్మిణి దేవత విగ్రహలకు దర్శించుకునేందుకు గ్రామంలో ఉన్న మహిళలు యువకులతో పాటు చుట్టు ప్రక్కలా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా భైంసా రూరల్ సి ఐ నైలు మరియు కుబీర్ ఎస్ ఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తూ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షడు పెంటజీ బోయిడి విఠల్ సిద్ధం వివేకానందు పుప్పాల పీరాజీ నాగలింగం సూది రాజన్న సంతోష్ సేట్ ఆయా కుల సంఘాల సభ్యులు యువకులు తదితరులు ఉన్నారు.