తలకోన రిలీజ్‌కి రెడీ

అక్షర క్రియేషన్‌ పతాకంపై నగేష్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘తలకోన’. ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రి రిలీజ్‌ వేడుక నిర్వహించారు. నిర్మాత శ్రీదర్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘మా హీరోయిన్‌ అప్సర రాణీ ఇప్పటి వరకు చేయని వెరైటీ సబెక్ట్‌ ఇది.అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది. అలాగే అదే అడవిలో ఇంకో కోణం కూడా ఉంటుందని చూపించాం’ అని అన్నారు.