పలిమెల మండలంలో తాగునీటికి ఇక్కట్లు – ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు
నవతెలంగాణ-పలిమెల/మహాదేవపూర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామపంచాయతీ పరిధి ఇంచంపల్లి, గర్రెగూడెం గ్రామాలలో మంచినీటి సమస్య తాండవిస్తోంది. నెల రోజు లుగా మంచినీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గ్రామాల వారు మంచినీళ్ల కోసం రెండున్నర కిలోమీటర్లు కాలినడకన ఎండలో గోదావరికి వెళ్లి పిల్లలు, వద్దులు తీవ్రమైన ఎండలో ఇబ్బందులు పడుకుంటూ మధ్య మధ్యలో చెట్టు నీడలో నీళ్లు తాగుతూ మంచినీటిని తెచ్చు కుంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న మోటారు పంపు స్టాటర్ మరమ్మతు ఉందని ఎవరు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వెంటనే అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మంచి నీటి సమస్య లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కాగా విసిగి వేసారిన ప్రజలు బుధవారం ఖాలీ బిందెలతో స్థానిక రోడ్డు పై బైటాయించి నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని బీష్మించుకు కూర్చు న్నారు. అయినా అదికారులు, రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా రాకపోవడంతో నీరాశకు గురై అవేదన వ్యక్తం చేసా రు. తాము కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తు కు వస్తామని, ఇప్పుడు గుర్తుకు రామా అని మండిపడ్డారు. తాత్కాలికంగా ధర్నా విరమించారు.