విద్యార్థినిలకు స్వతంత్ర దినోత్సవ రోజున ప్రతిభా పురస్కారాలు

Talent awards for girl students on Independence Dayనవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం  ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పైబడిన కోర్సులలో విద్యార్థినిలు ఎవరైతే 80 శాతానికి పైగా మార్కులు పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం అధ్యక్ష కార్యదర్శులు  నరేష్ , కొండల్ ఆదేశాలనుసారం రాష్ట్ర సంఘ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం  సుభాష్ నగర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు మాస్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర సంఘ, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ విద్యార్థినిలకు ప్రతిభా పురస్కారాలు ఎవరైతే అర్హులు ఉంటారో వారు సుభాష్ నగర్ కార్యాలయంలో ఈనెల 31 జులై లోపు తమ మార్కుల మెమో, బయోడేటాను అందజేసినట్లయితే వాటిలో నుండి ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్ర వంజరీ సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. తదితర వివరాలకై  సభ్యులకు ఫోన్ ద్వారా సంప్రదించగలరు వివరాలకై 9848490055, 98493 91493 లకు సంప్రదించగలరు. ఇదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వంజరి  సంఘం నిజామాబాద్ ప్రతినిధులు అయినటువంటి రాష్ట్ర నాయకులు కాలేరు గడ్డం శ్రీనివాస్, మయావర్ సాయిరాం,నగర అధ్యక్షులు గంగోనే గంగాధర్ బిజెపి, జిల్లా అధ్యక్షులు భోనేకర్ భూమయ్య పాల్గొన్నారు.