వెలాసిటీ విద్యార్థులకు ప్రతిభ అవార్డులు

నవతెలంగాణ – అచ్చంపేట
2023 24 విద్యాసంవత్సరానికి గాను సివి రామన్ నిర్వహించిన రాష్ట్ర బలం పియాడులో  పట్టణo లోని వెలాసిటీ పాఠశాల విద్యార్థులు వైష్ణవి, లక్ష్మీకేతన, మోక్ష, కృతిప్ రెడ్డి లు  ప్రతిభ కనబరిచారు. ఉమ్మడి జిల్లా లో ద్వితీయ ర్యాంకులు సాధించారు. పాటల రచయిత చంద్రబోస్, డి ఆర్ డి ఓ చైర్మన్ సతీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు అందుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ విద్యార్థులను అభినందించారు.