
రాష్ట్రస్థాయి అండర్ 23 కుస్తీ పోటీలలో నిజామా బాద్ జిల్లా క్రీడాకారులు నేహా, సిజ్రా, సురేందర్ అమర్ సింగ్, సోఫియా, శ్రీకాంత్, శివాని ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండు గోల్డ్, రెండు సిల్వర్రు, మూడు బ్రాండ్ మెడల్స్ సాధించడం జరిగింది. ఈ యొక్క టీంకు కోచ్ గా మరియు మేనేజర్ గా దేవేందర్ వ్యవహరించారు. వీరిని నిజామాబాద్ జిల్లా రెజిలింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భక్తవత్సలం మరియు ప్రధాన కార్యదర్శి దేవేందర్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా క్రీడ కారులు పాల్గొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా కి మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు.