యువజన ఉత్సవాలలో నెల్లికుదురు విద్యార్హుల ప్రతిభ 

Talent of Nellikuduru students in youth festivals– ప్రతి విద్యార్థి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరచాలి
– విజేతలకు అభినందనలు 
– స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నెల్లికుదురు ప్రభుత్వ ఉద్యోగి కళాశాల విద్యార్థులు యువజన ఉత్సవాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి నెల్లికుదురు కే గుర్తింపు తెచ్చిన విద్యార్థులను వారిని అభినందించినట్లు నెల్లికుదురు ఎస్సై చీరాల రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గురువారం  ఉమ్మడి వరంగల్ స్థాయిలో యువజన ఉత్సవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వాలంటీర్లు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్  ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ ల నుండి బహుమతులతో పాటు ప్రశంసలను అందుకున్నారు. జూనియర్ విభాగంలో దేశభక్తి గేయ రచనలో ప్రథమ బహుమతి జి. మాధవి, డిబెట్ లో బి. నవీన్, జి. అనిత, సోలో సాంగ్ విభాగంలో పి.యశ్వంత్ ద్వితీయ బహుమతి, పోస్టర్ పెయింటింగ్ లో సి హెచ్. నరేందర్, గ్రూప్ డ్యాన్స్ లో  వైష్ణవి, సభిల, కావ్యశ్రీ, సుస్మిత, శృతి, కల్పన లు తృతీయ బహుమతి, ఎగ్జిబిషన్ లో శ్రావణి, నవ్య, సోమ్మన్న లు ప్రథమ బహుమతిని అందుకున్నారు. బహుమతులు అందుకున్న విజేతలను శుక్రవారంనాడు కళాశాలలో నిర్వహించి ప్రశంసలను కురిపించారు. విద్యార్థులు చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రథమ కనపర్చాలని వాలంటీర్లకు సూచించారు. అధ్యాపకులు చెప్పే విషయాలను జాగ్రత్తగా విని వాటిని వైఫల్యం లేకుండా ఆచరణలో పెట్టాలన్నారు. త్వరలో జరిగే యూనివర్సిటీ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి కళాశాలకు మరియు నెల్లికుదురు మండలానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు దగ్గర ఉండడంతో విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో పాఠ్యాంశాలను అభ్యసించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ స్థాయిలో జరిగిన యువజన ఉత్సవాలలో బహుమతులు గెలుపొందిన వాలంటీర్లను, ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్, అధ్యాపకుడు మహేందర్ ను ఇన్చార్జి ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ ,కవిరాజ్ ,మహేందర్, నాగేశ్వర రావు, వెంకటేశ్వర్లు, యాకన్న ,సతీషు బాబు, సుధాకర్, రామ్మూర్తి, సుభాష్, శ్రీనివాస్, గౌరీ శంకర్, లక్ష్మణ్, ప్రదీప్, సైదా ,తదితరులు పాల్గొన్నారు