న్యూ విజన్ విద్యార్థుల ప్రతిభ 

నవ తెలంగాణ- నకిరేకల్:
ఇటీవల నిర్వహించిన శ్రీనివాస రామానుజన్ నేషనల్ లెవెల్ ఒలంపియాడులో నకిరేకల్ కు చెందిన న్యూ విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన 16 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. అశోక్ కుమార్ తెలిపారు. పాఠశాలకు చెందిన ఎస్కే ఆప్షన్, కె హర్షిత్ రెడ్డి, ఎస్ కె రేహాన్, ఏ కృత్విక, కె హిమశ్రీ, కె లోహిత, పి సరస్వతి, పి రాజ్ కుమార్, ఎస్ కె మినహాజ్, జి విగ్నేష్, సి హెచ్ భరత్, ఎస్ శామ్యూల్ రాజ్, సిహెచ్ చంద్ర శ్రీ నందన్, జి వికాస్, ఏ అనిరుద్, ఎం నిషిత రాష్ట్రస్థాయిలో జరిగే ఫైనల్ లెవల్ కు ఎంపికైనట్లు తెలిపారు. ఫైనల్ లెవల్ కు ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.