
హైదరాబాదులో జరిగిన అండర్ 23 రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలో నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామానికి చెందిన ఎస్కే నేహా, భీంగల్ గ్రామానికి కు చెందిన సిజ్రా మెహవీన్ బంగారు పతకాలు సాధించడం జరిగింది వారిని నిజామబాద్ జిల్లా రెజిలింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ భక్తవత్సలం నిజామబాద్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నర్సింగ్ రావు, ఉపాధ్యక్షులు జయపాల్, రాజ్ కుమార్ సుబేదార్ సురేష్ అభినందించడం జరిగింది. అదేవిధంగా కోచ్ దేవేందర్ నీ శ్రీ భక్తవత్సలం అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పథకాలు సాధించి జిల్లాకు మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు.