
మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు కరీంనగర్ లో ఆదివారం నిర్వహించిన జోనల్ స్థాయి అబాకాస్ పోటీలలో విద్యార్థులు ప్రతిభచాటారు. జోనల్ స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ యశోద శైలజ, కరస్పాండెంట్ యశోద అంజయ్య ఉపాధ్యాయ బృందం అభినందించారు. జూనియర్స్ విభాగం జోనల్ స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన నీల ప్రవీణ రాష్ట్ర స్థాయికి అర్హత సాదించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు అబాకాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంస్థ తరపున జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. అబాకస్ లో విద్యార్థులకు మెలకువలు నేర్పి పాఠశాల గణిత టీచర్లు ప్రియాంక, నమిత, దివ్యలను పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.