జోనల్ స్థాయి క్రీడల్లో పట్టణ గురుకుల విద్యార్థుల ప్రతిభ

Talent of Urban Gurukul Students in Zonal Level Sportsనవతెలంగాణ – ఆర్మూర్ 
ఈనెల 11 నుండి 14 వరకు నాలుగు రోజుల నుండి  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల  విద్యాలయ సంస్థ నిర్వహించిన బాసర జోన్ 10వ  జోనల స్పోర్ట్స్ మీట్  ముధోల్ వేదికగా జరిగిన  ఆటలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు పలు కేటగిరీలో ప్రతిభను కనబరిచి అత్యధికంగా బహుమతులు గెలుపొందడం జరిగిందని గురుకుల ప్రిన్సిపల్ పూర్ణచందర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ 14 విభాగంలో ద్వితీయ స్థానంలో చెస్ అండర్ 14 విభాగంలో  కబడ్డీ, అండర్ 14 విభాగంలో ఖోఖో అండర్ 14 విభాగంలో  టెనికైట్.అండర్ 14 విభాగంలో టీం. ఛాంపియన్ నిలవడం జరిగింది అని, అండర్ 14 విభాగంలో క్యాంప్టన్ గా మహానంద్ , విగ్నేష్ నేర్తృత్యంలో అండర్ 14 విభాగంలో ఓరల్ ఛాంపియన్షిప్ గా గురుకుల విద్యార్థులు  నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్, సిబ్బందిని విద్యార్థులను అభినందించారు. ఇ విద్యార్థులను విజయానికి కృషిచేసిన వైస్ ప్రిన్సిపల్ సాయన్న. దయల్. చక్రపాణి.గంగాధర్. ప్రేమ్. సంధ్యారాణి. రవి. గణేష్. రాజేశ్వర్. వ్యాయామ ఉపాధ్యాయులు . పిడి జ్ఞానేశ్వర్ , పి ఈ టి  రాజేందర్. నరేష్. పాఠశాల కళాశాల బృందం  నాన్ టీచింగ్ స్టాప్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.