నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు విశ్వం ఎడుటెక్ హైదరబాద్ వారిచే జిల్లా స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ నందు ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం గర్వకారణం. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతి విద్యార్థుల ప్రతిభను శనివారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ గారి చేతుల మీదుగా రాష్ట్రస్థాయికి ఎంపికైనటువంటి విద్యార్థిని రిద్ధి ,విద్యార్థి వర్శిత్ లకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర సలజదారు జయసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రిద్ది, వర్షిత్, ఆయుష్ మాన్, ఇరాన్ మహీం, గౌతమ్, హేమ శ్రీ, వర్షిత పవర్ పాల్గోన్నారు. పెర్కిట్ కాంతి స్కూల్ విద్యార్థులు సైతం విశ్వం స్కూల్ లాబ్స్ ఆధ్వర్యంలో అబాకస్ & వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలు నిజామాబాద్ లోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి 120 పాఠశాలల నుండి పాల్గొన్న 530 మంది పిల్లల్లో ప్రథమ,ద్వితీయ బహుమతులలో 48 మంది పిల్లలు విజేతలుగా ఎంపికయ్యారు. వీరిలో కాంతి హై స్కూల్ నుండి 13 మంది విద్యార్థులు (శ్రీయన్షి, అన్విక, జ్ఞానిత, యశ్వంత్, వైశ్విక, శశివర్ధన్, రిషిత్, రుద్రాన్ష్, స్వాజిత్, రాజేష్, ప్రభుకిరణ్, దీక్షిత్ మరియు లక్ష్మీరాజ్) జయకేతనం ఎగురవేశారని కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి శనివారం తెలియజేసారు. ఈ విజయం మరెన్నో ఘనవిజయలకు పునాది కావాలని, వీరు మాకు ఎంతో గర్వకారణం అని తెలిపారు. వీరిలో ఆరుగురు ఫిబ్రవరి 25 న జరిగే స్టేట్ లెవెల్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఈవో దుర్గాప్రసాద్ స్టేట్ స్పోక్ పర్సన్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జయ సింహ గౌడ్ , అర్బన్ ప్రెసిడెంట్ ధర్మ రాజు, స్టేట్ అడ్వైజర్ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ పిల్లల్లో మాథెమాటిక్స్ అంటే ఎంతో భయం ఉంటుందని ఈ అబాకస్ నేర్చుకోవడం వలన పిల్లల్లో సృజనాత్మక శక్తి, జ్ఞాపకశక్తి పెంపొందించేందుకే కాకుండా మాథెమాటిక్స్ అంటే భయం వీడి ఉన్నతంగా యెదిగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు..