మహేష్ కుమార్ గౌడ్ తో కాదు.. మాతో మాట్లాడు

Not with Mahesh Kumar Goud.. Talk to us– రాజీనామా నువ్వు చేస్తావో మేము చేస్తామో
– బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సవాల్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ముందుగా కెసిఆర్, ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా ఆరోపణలు పథకాల అమలుపైన చేస్తున్నారని జిల్లా అధ్యక్షునిగా పథకాల అమలుపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంలోని ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో అనే దాని పైన చర్చకు జిల్లా అధ్యక్షునిగా నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని సమయాన్ని నిర్ణయించి సిద్ధంగా ఉండాలని మానాల మోహన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రతిసవాల్ విసిరారు. పత్రిక సమావేశాలలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రశాంత్ రెడ్డికి మంచిది కాదని మానాల మోహన్ రెడ్డి హితవు పలికారు. 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ముందుగా ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలని తెలిపారు. ఆ తర్వాతే మా నాయకులపై మాట్లాడాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదని, 12% రిజర్వేషన్ చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని, లెక్కలేనని హామీలు ఇచ్చి తుంగలో తొక్కిన వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులని అన్నారు.
ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే దాదాపు 80 శాతం హామీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, అందులో ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గాని, రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్ అందించడం గానీ అదే విధంగా రెండు లక్షలు రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు చేస్తామని చెప్పి పది లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, అదేవిధంగా రైతు రుణమాఫీ ద్వారా 30 వేల కోట్ల రూపాయలు మాఫీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్యాంకుల ద్వారా వచ్చిన రూ.18000 కోట్ల బకాయిలను ఏకకాలంలో పూర్తి చేసిందని మిగిలిన 12 వేల కోట్ల రూపాయలను ఫ్యామిలీ గ్రూమింగ్ రెండు లక్షల పై చిలుకు ఉన్నవారికి రుణమాఫీ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని ,అదేవిధంగా నిరుద్యోగులకు సంవత్సరకాలంలో 50వేల ఉద్యోగాలు కల్పించి టిఆర్ఎస్ ప్రభుత్వా హాయంలో టిఎస్పిఎస్సి ని ఆట బొమ్మగా చేసి వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ కి ధీటుగా తయారు చేసే ప్రాణాలిక చేస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చివరి రెండు సంవత్సరాల లో ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు గాని కల్యాణ లక్ష్మి బిల్లులు గాని సీఎంఆర్ అప్లికేషన్లను పెండింగ్లో పెట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన సీఎంఆర్ఫ్, కల్యాణ లక్ష్మి చెక్కులను మంజూరు చేస్తూనే ప్రస్తుతం వస్తున్న వాటికి కూడా నిధులు మంజూరు చేస్తుందని, ఆ మంజూరు చేసిన సీఎంఆర్ఫ్ చెక్కులను బాల్కొండ నియోజకవర్గంలో పంచుతున్న ప్రశాంత్ రెడ్డికి కండ్లు కనిపించడం లేదా అని మానాల మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు .అదేవిధంగా రైతుబంధు పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లకు గుట్టలకు గ్రామాలలో వెంచర్లుగా మారిన భూములకు సుమారు రూ.25 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, వాటిని సరి చేయడానికి సమయం పడుతుంది కావున రైతుబంధు ఇవ్వడానికి ఆలస్యం అవుతుందని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఇబ్బందులు పడ్డ మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడం చూస్తుంటే అది మీ అజ్ఞానానికి నిదర్శనం అని, గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేను వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడితే ప్రశాంత్ రెడ్డికి తెలివిలేదనేది బయటపడిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే దానిని తప్పుగా అర్థం చేసుకొని రాజీనామా చేస్తానని చెప్పిన ప్రశాంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలలో పథకాలు అమలు చేయనందుకు ముందుగా రాజీనామా చేయాలని, గత నెల రోజులుగా ప్రశాంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని ఇటీవల గుడి ప్రాంగణంలో రాజకీయాలు చేయడం గానీ, అంతకుముందు సర్పంచుల సమస్యలపై సానుభూతి తెలపడం చూస్తుంటే ప్రశాంత్ రెడ్డికి నిజంగానే మతిస్థిమితం కోల్పోయాడని విషయం బయటపడిందని ,నిజానికి సర్పంచుల బిల్లులు ఆలస్యం కావడానికి వారు నష్టాల్లోకి వెళ్లడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల బిల్లులను పెండింగ్లో పెట్టడమే అని ప్రశాంత్ రెడ్డి సర్పంచుల సమస్యపై స్పందించిన తీరు చూస్తుంటే హత్య చేసిన వారి సానుభూతి తెలపడం మాదిరిగా ఉంది అని మనల మోహన్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ రెడ్డి చర్చకు సిద్ధమైతే మా రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్ గౌడ్ అవసరం లేదు అని జిల్లా అధ్యక్షుడిగా నేను గతంలో జిల్లా మంత్రిగా బీఆర్ఎస్ పార్టీకి పెద్దదిక్కుగా మీరు చర్చించుకుందాం అని, సమయాన్ని స్థలాన్ని నిర్ణయించి మాకు తెలియజేస్తే ఏ సమయంలో అయినా రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని మానాల మోహన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. అదే విధంగా నిజామాబాద్ నగరంలో ఎవరైతే తమ భూములు కబ్జాకు గురయ్యాయో వారు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి మాకు కాఫీ ఇస్తే కబ్జాల వెనుక ఎవరు ఉన్న ప్రజలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు సూచనలు ఇస్తుందని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, జిల్లా ఎన్ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్ ,మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, నగర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, కార్పోరేటర్ రోహిత్ ,జిల్లా ఫిషర్ మెన్షన్ అధ్యక్షులు శ్రీనివాస్ ,శివ  తదితరులు పాల్గొన్నారు.