పరేడ్ గ్రౌండ్ కి తరలిన తాళ్లపల్లి ముదిరాజులు 

నవతెలంగాణ దుబ్బాక రూరల్ : ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన పార్టీల్లో  సీట్లు కేటాయించాలని తాళ్లపల్లి గ్రామ ముదిరాజు సంఘం నాయకులు అన్నారు. హైద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో తలపెట్టిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు అక్బర్ పేట్ భూంపల్లి మండలం తాళ్ళ పల్లి గ్రామానికి చెందిన ముదిరాజులు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్ట సభల్లో ముదిరాజులకు తగిన స్థానం కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ముదిరాజులు పోటీ చేసేలా   లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో అయా పార్టీలు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.లేని పక్షంలో స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగి ముదిరాజుల సత్తా చాటుతామని అన్నారు. కార్యక్రమంలో తాళ్లపల్లి గ్రామ ముదిరాజు సంఘం నాయకులు గోపరి నాగరాజు, గోపరి నరసింహులు, వేల్పుల యేసు, వేల్పుల మల్లేశం, వేల్పుల హనుమంతు, గోపరి రమేష్, వేల్పుల అంజయ్య,పెద్దల ఆంజనేయులు, వేల్పుల ఎల్లం, దొంగల దుబ్బయ్య, గోపరి యాదగిరి, అరిగే కృష్ణ తదితరులు ఉన్నారు.