నాగ సాధుగా తమన్నా

Tamanna as Naga Sadhuతమన్నా ప్రధాన పాత్రధారిణిగా ‘ఓదెల 2’లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్‌ చేయడానికి రెడీగా ఉన్నారు. తమన్నా తన కెరీర్‌లో తొలిసారి ఈ సినిమాలో శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘ఒదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీని అశోక్‌ తేజ డైరెక్టర్‌ చేస్తున్నారు. మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్‌ ఓదెల విలేజ్‌లో జరుగుతోంది. కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్‌ సీక్వెల్‌ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఐకానిక్‌ ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్‌, యువతోపాటు ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో ఎమోషనల్‌ డెప్త్‌, అడ్రినలిన్‌-పంపింగ్‌ యాక్షన్‌తో నిండిన ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.