తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ కన్నుమూత

తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ కన్నుమూతప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ (48) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీలో నొప్పి కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. టీవీ సీరియల్స్‌తో కెరీర్‌ ఆరంభించిన డేనియల్‌ బాలాజీ తెలుగు, తమిళం, మలయాళం వంటి తదితర భాషలల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్‌తో ‘ఘర్షణ’, నానితో ‘టక్‌ జగదీష్‌’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ‘డేనియల్‌ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికరమైనది. తన కళ్లను దానం చేసి ఎదుటివారి జీవితాల్లో వెలుగుల్ని నింపారు’ అంటూ కమల్‌హాసన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.