అనుమతులతో అక్రమార్జన

– రోజంతా ఒక్కె వెబిల్లు.

– రూ. 3 వేల నుంచి రూ. 3500 టిప్పరు. 
నవతెలంగాణ – మాక్లూర్
అనుమతులు ఉన్నాయంటూ కొండలను తొవ్వెస్తు అక్రమంగా అక్రమార్జన చేస్తున్న మొరం మాఫియా. మండలంలోని సింగమపల్లి గ్రామ శివారులోని 51/2 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నుంచి అనుమతులు తీసుకొని ఒక్కో వెబిల్లుతో సుమారు ఎనిమిది టిప్పర్లను తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.  అనుమతుల పేరుతో కొండల్ని తొవ్వి మొరాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మొరం మాఫియా సిండికేట్ గా మరి అనుమతులు ఒక్కరిపై ఉంటే టిప్పర్లు గల వ్యక్తులంత ఏకమై కొండల్ని తొవ్వెస్తున్నరు. ఒక్కో టిప్పరు సుమారు రూ. 3 వేల నుంచి రూ. 3500 వరకు అమ్ముకుంటున్నారు.
జరిమానా చెల్లించకుండానే మళ్ళీ తవ్వకాలు: గతంలో అనుమతులు ఒక్క చోట తవ్వకాలు మరో చోట జరిపారని పుప్పాల గంగారెడ్డి అనే వ్యక్తికి రూ. 89,22,900 లక్షలు జరిమానా మైనిగ్ అధికారులు వేశారు. జరిమానా చెల్లించకుండా మళ్ళీ తవ్వకాలు జరుపుతున్నారు. అప్పటి నుంచి గంగారెడ్డి కుటుంబ సమేతంగా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆయన పేరుపై అనుమతులు ఉన్న చోట తవకాలు జరుపుతున్నారు. ఆయన లేకుండానే ఆయన పేరుతో మొరం తావకలు ఎలా జరుపుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ తవ్వకాల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బవమర్డి నరేందర్ రెడ్డి 20శాతం వాటాను పవన్ రెడ్డికి అమ్ముకోవడం ఆయన వాహనాలు పెట్టి మొరాన్ని తరలిస్తున్నారు.
మైనింగ్ అనుమతి మాకు సంబంధం లేదు – తహసిల్దార్ షబ్బీర్: రెవెన్యూ నుంచి కాకుండా జిల్లా మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు పొదరని, రెవెన్యూ కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.