‘తండేల్‌’ ట్రైలర్‌ అద్భుతం : అమీర్‌ఖాన్‌

'Tandel' trailer is amazing: Aamir Khanనాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో హీరో కార్తి విడుదల చేశారు. శుక్రవారం బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”తండేల్‌’ ట్రైలర్‌ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్‌గా ఉంది. డైరెక్టర్‌ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్‌ ఫెంటాస్టిక్‌గా ఉంది. దేవిశ్రీ చేసిన ‘డింకచిక డింకచిక..’ సాంగ్‌ నా ఫేవరెట్‌. ఈ ట్రైలర్‌లో హార్ట్‌ టచింగ్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. చైతన్య అద్భుతమైన యాక్టర్‌. ఐడియల్‌ కోస్టార్‌. తనతో వర్క్‌ చేయడం చాలా అమెజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. సాయి పల్లవి కూడా చాలా మంచి పెర్ఫార్మర్‌. అల్లు అరవింద్‌ నాకు బ్రదర్‌ లాంటి వారు. ఆయన నిర్మించిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి’ అని తెలిపారు. ‘సాయి పల్లవితో చేసిన ‘లవ్‌ స్టోరీ’ ట్రైలర్‌ని అమీర్‌ ఖాన్‌ చూసి చాలా బాగుందని మెసేజ్‌ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఈ ట్రైలర్‌ని కూడా ఆయనే లాంచ్‌ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన ట్రైలర్‌ లాంచ్‌ చేయడం నాకు మ్యాజికల్‌ మూమెంట్‌. ‘లాల్‌ సింగ్‌’ సినిమా అమీర్‌తో చేయడం నాకు గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇదొక బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలిశాను. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్‌గా ఉంటుందో అర్థమైంది. ఇలాంటి కథలు యాక్టర్స్‌కి చాలా అరుదుగా వస్తాయి. ఇది నాకు ఒక పెద్ద అవకాశం. ఇలాంటి సినిమాల్లో పార్ట్‌ కావడం అదష్టంగా భావిస్తున్నాను. నన్ను ట్రస్ట్‌ చేసిన అరవింద్‌కి థ్యాంక్స్‌. ఆయనతో చేసిన ‘100% లవ్‌’ నా కెరీర్‌లో ఒక టర్నింగ్‌ పాయింట్‌. ‘తండేల్‌’ కూడా మరో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని భావిస్తున్నాను. చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్‌ బస్టర్స్‌ అయ్యాయి. సాయి పల్లవి అద్భుతంగా నటించింది. మీరంతా ఈనెల 7న సినిమాని ఎంజారు చేస్తారని కోరుకుంటున్నాను’ అని నాగచైతన్య చెప్పారు.